రంజాన్ శుభాకాంక్షలుతెలిపిన ఎమ్మెల్యే కుంభం

రంజాన్ శుభాకాంక్షలుతెలిపిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణం లోని నూతన ఈద్గా లో ఈద్ ఉల్ ఫిత్ర్, రంజాన్ పండుగ సందర్బంగా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్, ఉపాధ్యక్షులు ఇస్తి యాక్ అహ్మద్ కు ముస్లిం మైనారిటీ లకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రంజాన్ సందర్బంగా నమాజ్ చదవడానికి, నూతన, పాత,ఈద్ గా లో ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే కుంభం తో పాటు మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ కు సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మౌలానా,ఫేరోజ్ అడ్వకేట్ రహీం, ఇక్బాల్ చౌదరీ ఇస్మాయిల్, ముజీబ్, రహీం నయీమ్,అంజద్ పాల్గొన్నారు.