ఉండమ్మా బొట్టు పెడతా

ఉండమ్మా బొట్టు పెడతా
  • బొట్టు పెడుతూ.. మ్యానిఫెస్టో వివరిస్తూ
  • సూర్యాపేట విద్యానగర్ లో గడగడపకు  మ్యానిఫెస్టో కార్యక్రమం లో సునిత జగదీష్ రెడ్డి
  • ఆప్యాయంగా పలకరిస్తూ మ్యానిఫెస్టో ను వివరించిన మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఉండమ్మా బొట్టు పెడతా అంటూ బొట్టు పెడుతూ.. మ్యానిఫెస్టో ను వివరిస్తూ.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్  రెడ్డి సతీమణి సునిత గురువారం సూర్యాపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి సతీమణి సునిత 33 వ  వార్డులో ఇంటింటికీ వెళ్లి, మహిళలకు బొట్టు పెట్టి, బీఆర్ ఎస్ మ్యానీ ఫెసస్టో ను వివరించారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన జగదష్  రెడ్డి గారిని మరోసారి గెలిపించాలని కోరారు. బీఆర్ ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు భరోసా అన్నారు. కేసిఆర్ పాలన  మహిళ కు పెద్ద పీట లభించిందన్నారు. సంక్షేమ పథకాలకు మహిళల పేరు నామకరణం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలకు నిదర్శనం అన్నారు. 400 రూపాయలకే గ్యాస్ అందివ్వడం , సౌభాగ్య లక్ష్మి కింద 3000 పెన్షన్, మహిళా సమాఖ్య భవనాలు వంటి పథకాలు మహిళా లోకానికి వరమని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సమాజమంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.