ఎన్​ఎస్​ఓ వృద్ది రేటు డేటా విడుదల

ఎన్​ఎస్​ఓ వృద్ది రేటు డేటా విడుదల


ముంబై: దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించి వేగంగా పెరుగుతోంది. తాజాగా.. భారతదేశం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) 2023 ఆగస్టు 31న విడుదల చేసిన డేటా ప్రకారం.. భారత వృద్ధి అత్యధికంగా ఉంది. ఈ వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని చెప్పవచ్చంటూ పేర్కొంది.మార్చినెలతో ముగిసిన గత త్రైమాసికంలో ఇది 6.1 శాతంగానే ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే.. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 1.7 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషం.