రజాకార్​సినిమాను ఆపే హక్కు లేదు

రజాకార్​సినిమాను ఆపే హక్కు లేదు
  • ఈ సినిమాకు శివసేన పార్టీ పూర్తి మద్దతు
  • శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రజాకార్ సినిమాను మరాఠీ, హిందీ భాషలో కూడా విడుదల చేయాలని, ఈ సినిమాను ఆపే హక్కు ఎవరికి లేదని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ అన్నారు. రజాకార్‌  సినిమా హాల్ చుట్టు రక్షణ కవచంలా శివసేన కార్యకర్తలు పని చేస్తారని, ఎవరు ఆపుతారో తాము చూస్తామంటూ సవాల్​ చేశారు. రజాకార్ సినిమాకి శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సినిమా డైరెక్టర్‌ యాట సత్యనారాయణ ను కలిసి శివాజీతో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపికిషన్​ సన్మానించారు. 

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ నిజాం రజాకారుల నీచమైన చరిత్రను కాంగ్రెస్ పార్టీ మాయం చెసిందని, కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లాగే చరిత్రను మాయం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్టేట్ లో మరాఠీ, కన్నడ, తెలుగు ప్రజలు ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో ప్రపంచానికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకు నిజాం రజాకారులు చేసిన భయంకరమైన పాలన ప్రజలకు చూపించేందుకు  రజాకార్‌ సినిమా రావటం సంతోషంగా ఉందని, సినిమా తీస్తున్న డైరెక్టర్‌ యాటా సత్యనారాయణ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.