బాకీలు చెల్లించలేదని రైతులు ఇళ్ల నుంచి సమాగ్రి పట్టుకెళిన అధికారులు

బాకీలు చెల్లించలేదని రైతులు ఇళ్ల నుంచి సమాగ్రి పట్టుకెళిన అధికారులు

పీఏసీఎస్ అధికారుల ఓవరాక్షన్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: రైతులు బకాయిలు చెల్లించలేదు అంటు.. పీఎసీఎస్ అధికారులు రైతుల ఇళ్లలో నుండి సామాగ్రిని బలవంతంగా ఆదివారం  తీసుకువెలిన సంఘటన వికారాబాద్‌ జిల్లా దరూరు మండలంలోని పి సి ఎం తాండా ,  నాసన్ పల్లి, అంపల్లి గ్రామాలలో చోటుచేసుకుంది. రైతులు పిఎసిఎస్ నుంచి తీసుకున్న రుణాలు చెలించలేదని అధికారులు అనేక గ్రామాల్లో  వసూలకు వచ్చారు. ఈ సందర్బంగా అధికారులు రైతులుతో  వ్యవహరించిన తిరు దారుణంగా ఉంది. బకాయిలు చెలించాలని వ్యవసాయదారుల ఇళ్లలోకి వెళ్లి దబాయించి మరీ ఇళ్లలోని విల్లువా గల వస్తువులను పీఏసీఎస్ కార్యాలయానికి తరలించారు. టీవిలు, బైక్ లు, ట్రాక్టర్ లు విలువైన వస్తువులను కార్యాలయానికి తరాలించారు. అధికారుల తీరును చూసి రైతులు  ఆవేదనకు గురి కాగా, అధికారుల తీరుపై రైతులు మడిపడుతున్నారు.