కొండగట్టులో తాటి, ఈత వనం దగ్ధం

కొండగట్టులో తాటి, ఈత వనం దగ్ధం

ముద్ర , మల్యాల మండలంలోని కొండగట్టు శివారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 300 తాటి చెట్లు, 500 ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. జగిత్యాల అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. మంటలు ఏవిధంగా వ్యాపించాయనే విషయం ఇంకా తెలియరాలేదు. తాటి ఈత చెట్లు దగ్ధం అవ్వడంతో తాటి, ఈత చెట్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు తీవ్ర నష్టం జరిగిందని స్థానిక గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్థికంగా ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.