రాజపేట మండలంలో ప్రశాంతంగా పోలింగ్ రాజపేట

రాజపేట మండలంలో ప్రశాంతంగా పోలింగ్ రాజపేట

ముద్ర : ఆలేరు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కార్యక్రమం సందర్భంగా గురు వారం ఆలేరు అసెంబ్లీ పరిధిలోని రాజాపేట మండలంలో అన్ని గ్రామాలలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల వరకే ఓటర్లు మొత్తం 40 బూతులవద్ద ఓటు కోసం క్యూ లైన్ లో నిలుచున్నారు. ఎస్సై సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల సంఘం ప్రకటించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్ళిన ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు . మండలంలోని 23 గ్రామ పంచాయతీలు మధిర గ్రామాలలో మొత్తం 29,364 ఓట్లు ఉండగా పురుషులు 14,653 మహిళలు 14,711 ఓట్లు ఉన్నాయి.

మండలంలో నాలుగు సమస్యత్మక, ఏడు సెమీ క్రిటికల్ గ్రామాలు ఉండగా ప్రత్యేక పోలీసు బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించారు . కాగా ఎన్నికల్లో 21 మంది పోటీ చేస్తుండగా నలుగురు అభ్యర్థులు రాజపేట మండలం నుండి పోటీలో ఉండగా వారితోపాటు మాజీ మంత్రి మోత్కూపల్లి నర్సింలు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూకంటి ప్రవీన్ పలువురు ప్రముఖులు వారి గ్రామాలలో ఓటును వినియోగించుకున్నారు.పోలింగ్ సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా ప్రచారం పోలింగ్ సరళి అన్ని గ్రామాలలో జరిగింది ఆయా పార్టీల నాయకులు తమ పార్టీ గెలుపు కోసం శ్రమించారు.