ప్రపంచం గర్వించే చంద్రయాన్ 3 విజయంలో ప్రీమియర్ సేవలు......

ప్రపంచం గర్వించే చంద్రయాన్ 3 విజయంలో ప్రీమియర్ సేవలు......
  • డైరెక్టర్ దుర్గాప్రసాద్ వెల్లడి....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరచిన చంద్రయాన్ 3 విజయంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మికుల కృషి కీలకంగా ఉందని కంపెనీ డైరెక్టర్ (ప్రొడక్షన్) వై దుర్గాప్రసాద్ రావు చెప్పారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ ప్లోజీవ్స్ కంపెనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్రోకు కావాల్సిన ఉద్యోగుల కాంట్రాక్టును పెద్ద కందుకూరు గ్రామంలోని పిఈఎల్ అప్పగించిందని చెప్పారు. చంద్రయాన్ 3 లో వినియోగించే సాలిడ్ ప్రొప్లయింట్ బూస్టర్ పి ఈ ఎల్ యాజమాన్యం. కార్మికులు సంయుక్తంగా ఇస్రోకు అందజేసినట్లు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంలో తమ పాత్ర కూడా ఉండడం సంతోషకరంగా ఉందని అన్నారు. దేశానికి అత్యంత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన చంద్రయాన్ 3లో తమకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్. బి ఎల్ ఎన్ రావు. డాక్టర్ మోహన్. పాండు. కర్ణాకర్ రెడ్డి.  కృష్ణయ్య. బి రమేష్. ఎం రమేష్. జి శ్రీనివాస్. కార్మిక సంఘం ప్రతినిధులు పి ఆదాం. పి గణేష్. జలంధర్. ఎస్ సంపత్. పెంటయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.