కార్పొరేటర్ ను పరామర్శించిన రవీందర్ సింగ్

కార్పొరేటర్ ను పరామర్శించిన రవీందర్ సింగ్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్  తండ్రి, నగర గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి దేవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ జ్యోతి నగర్ లోని జితేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేవేందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం రాంనగర్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో  మృతిచెందారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శంచారు. బత్తిని శ్రీనివాస్ సోదరుడు బత్తిని కరుణకర్ కు కూడ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం జరగడంతో కాలుకు ఆపరేషన్ జరిగింది. వారిని కూడా పరామర్శించి త్వరగా కోలకోవాలని ఆకాంక్షించారు. మాజీ కార్పోరేటర్ పెద్దపల్లి రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము తదితరులు రవీందర్ సింగ్ వెంట ఉన్నారు.