జీవో 59లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలి: కార్పొరేటర్ ఏనుగు పావని

జీవో 59లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాలి: కార్పొరేటర్ ఏనుగు పావని

ముషీరాబాద్, ముద్ర: గాంధీనగర్ డివిజన్ లోని జవహర్ నగర్ ఎస్సార్టీ, టీఆర్టీ క్వార్టర్స్ లో ఖాళీ స్థలాలను జీవో 59 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే రిజి స్ట్రేషన్ చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఏనుగు పావని అన్నారు. హైదరబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారిని బుధవారం కలిసిన కార్పొరేటర్ వినతి పత్రాన్ని సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ చేయడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారి స్థలాలను సర్వే కూడా చేయించాలని కోరారు. 40 సంవత్సరాలుగా నివాసముంటున్న అనేక మంది లబ్ధిదారులు తమ క్వార్టర్స్ ముందు ఖాళీ స్థలాలను, ఇండ్లను నిర్మించు కున్న స్థలాలను జీవో 59 ప్రకారం తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారని వివరించారు. వారి సమస్యలు సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. కార్మికుల కుటుంబాల పట్ల అధికారులు సానుకూలంగా ఉండాలన్నారు.