హోరాహోరీగా సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్-3 టోర్నమెంట్

హోరాహోరీగా సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్-3 టోర్నమెంట్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్-3 టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతుంది. ఆదివారం మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న టోర్నమెంట్ లో మొత్తం 11 జట్లు పాల్గొంటున్నాయి. చాలా ఏళ్ల క్రితం క్రికెట్ ఆటాడి ఆయా వృత్తుల్లో ఉన్నప్పటికీ సీనియర్ క్రికెటర్స్ ఆటలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా బ్యాట్ దూళిపిస్తున్నారు. బౌలింగ్ లో చెలరేగారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు యువకులు తరలివచ్చారు.

ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శంకర్ రావు, అధ్యక్షులు జుబేర్ అహ్మద్, కార్యదర్శి నందిని శీను, సభ్యులు కొండ శ్రీనివాస్, చకిలం శ్రీనివాస్, అర్జున్, శివనాగు, ఒమార్, సనట మ్యాచ్ పర్యవేక్షించారు. లెక్చరర్ ప్రభు వ్యాఖ్యనం అలరించింది. క్రీడాకారులకు భోజనం ఏర్పాట్లు చేశారు. రాయకంటి మోక్షిత్ జ్ఞాపకార్ధం తండ్రి శ్రీనివాస్ మెమంటోలు అందజేశారు. స్థానిక కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్ లష్మినారాయణ గౌడ్, నాయకులు అశోక్, తొడుపునూరి శివరామకృష్ణ, చోళ రాంచరణ్ యాదవ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది సైతం ఒక టీంగా ఏర్పడి క్రికెట్ ఆడారు.