జారిపడిన కేసీఆర్

జారిపడిన కేసీఆర్
  • కుడి కాలికి గాయం

ముద్ర,హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్  అధ్యక్షుడు గురువారం అర్ధ రాత్రి బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడి కాలికి తుంటి వద్ద గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు జరుగుతున్నాయని శస్త్ర చికిత్స అవసరమా లేదా అన్నది త్వరలో డాక్టర్లు నిర్ధారిస్తారని కేసీఆర్ కుమార్తె కవిత తెలిపారు. కుమారుడు కెటి రామారావు మేనల్లుడు పటి హరీష్ రావు ఆయన వెంటే ఉన్నారు. కేసీఅర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.