జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులను అందజేసిన సన్ సీడ్ హాస్పిటల్ ...

జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులను అందజేసిన సన్ సీడ్ హాస్పిటల్ ...

ముద్ర, కుషాయిగూడ:ప్రతి జర్నలిస్టు కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలనే తపనతో, మా హాస్పిటల్ లో 50 శాతం రాయితీని కల్పిస్తూ జర్నలిస్ట్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేస్తున్నామని  సన్ సీడ్ హాస్పిటల్  చైర్మన్ డాక్టర్ అన్వేష్ తెలిపారు. కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న సన్ సీడ్ హాస్పిటల్ అధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ పరిధిలోవిధులు నిర్వహిస్తున్న విలేఖరులకు 50 శాతం రాయితీ తో కూడిన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా  డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ.. నేను కూడా ఒక జర్నలిస్టు కుమారుడినని, జర్నలిస్టుల యొక్క సాధకబాధకాలు గుర్తించి, మా సన్ సీడ్ హాస్పిటల్ లో కాప్రా ప్రెస్ క్లబ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు హెల్త్ కార్డులను అందజేశామన్నారు. జర్నలిస్టులకు వైద్య రాయితీ తో కూడిన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు, తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాయితీ కార్డులను జర్నలిస్టుల కుటుంబసభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీ యూ డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోతె వెంకట్ రెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శనిగరం అశోక్, లు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రత విషయంలో ఆలోచించి వారికి హెల్త్ కార్డులను అందిస్తున్న సన్ సీడ్ అస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాల్ రాజు గౌడ్, కోశాధికారి లక్కిడి బాల్ రెడ్డి , సన్ సీడ్ హాస్పిటల్ సిఈవో రాములు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తేజస్విని, సూపరిండెంట్ డాక్టర్ భానుప్రకాష్, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ లావణ్య, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వైష్ణవి, మార్కెటింగ్ మేనేజర్ పి.రాజు, తదితరులు పాల్గొన్నారు.