Telangana Group-1 Prelims Exam - గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌ - ప్రిలిమ్స్ పరీక్షపై TSPSC కీలక అప్‌డేట్‌

Telangana Group-1 Prelims Exam - గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌ - ప్రిలిమ్స్ పరీక్షపై TSPSC కీలక అప్‌డేట్‌

ముద్ర,తెలంగాణ బ్యూరో:- గ్రూప్-1 పరీక్షలపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓఎంఆర్‌ విధానంలోనే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. కాగా నాలుగు లక్షల మందికిపైగా అభ్యర్థులు గ్రూప్‌-1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న TSPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.