టెట్ నిర్వహించాలి. తెలుగు పేపర్ 3 నిర్వహించాలి

టెట్ నిర్వహించాలి. తెలుగు పేపర్ 3 నిర్వహించాలి

తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు చాలా వరకు నోటిఫికేషన్లను ఇవ్వడం జరిగింది. కావున అదే విధంగా  మరో టెట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీఎస్సీ మరియు గురుకులాలకు సంబంధించి  టీజీటీ,పీజీటీ రాయాలంటే  కచ్చితంగా టెట్ అవసరం కాబట్టి  ఎన్ సీ ఆర్ టీ ప్రకారం టెట్ అనేది  సంవత్సరం గాను  రెండుసార్లు నిర్వహించాల్సి ఉంటుంది.

కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  టెట్ ను 2016,17,2022, మాత్రమే నిర్వహించింది. దీనివలన  చాలామంది. టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులుచాలామంది ఉన్నారు. కావున దీనిని దృష్టిలో పెట్టుకుని  తెలంగాణ ప్రభుత్వం మరో టెట్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెట్ అనేది కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష  కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరో టెట్ ను నిర్వహించి నిరుద్యోగులకు టెట్ కోసం ఎదురుచూసిన అభ్యర్థుల కోసం టెట్ ను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

తెలుగు పేపర్ 3 నిర్వహించాలి.

తెలంగాణ ప్రభుత్వం  ఎస్ జీ టీ వారికోసం  పేపర్ 1 స్కూల్ అసిస్టెంట్  కోసం పేపర్ 2  నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష  విధానం వలన  తెలుగు, హిందీ,  ఉర్దూ,  భాషా పండిత అభ్యర్థులు  తీవ్రంగా నష్టపోతున్నారు. లాంగ్వేజ్ పండిట్ ల కోసం మన పక్క రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్  పేపర్ 3 నిర్వహిస్తున్నది.  అదే విధానాన్ని మన తెలంగాణ లో ను అవలంబించాలి.  లాంగ్వేజ్ పండిట్ లు పేపర్ 2  రాయడం వలన ఇబ్బందులు ఉంటాయి. ఈ పేపర్లో  పండిట్ లకు సంబంధంలేని  సోషల్, మాథ్స్, సబ్జెక్టులకు సంబంధించి  60 మార్కులు  ఉంటాయి. దీంతో టెట్ క్వాలిఫై కాలేకపోతున్నామని భాషా పండితలు ఆందోళన చెందుతున్నారు. అందుకే తమకు పేపర్ 3  నిర్వహించాలని కోరుతున్నారు.

తెలుగు పండితు అభ్యర్థుల కోసం  పేపర్ 3 టెట్ నిర్వహించాలి. మన తెలంగాణ ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు గారు తెలుగు అభిమాని కాబట్టి మరియు ప్రపంచ తెలుగు మహాసభలో  1,  నుండి ఇంటర్ వరకు తెలుగును  ఒక సబ్జెక్టుగా  గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు.  కాబట్టి భాషా పండితుల కోసం ముఖ్యమంత్రి తెలుగు అభిమాని కాబట్టి పేపర్ 3 నిర్వహించాలని భాషా పండితుల కోసం  ప్రత్యేకంగా టెట్ పేపర్ 3  నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


దేవులపల్లి రమేశ్, (MA.B.Ed, TPT)
ఉస్మానియా యూనివర్సిటీ.