దీప్తి మృతిలో వీడని మిస్టరీ..

దీప్తి మృతిలో వీడని మిస్టరీ..
  • అక్కను నేను చంపలేదు..
  • అక్క మద్యం సేవించింది..
  • మద్యం తెప్పించింది నేనే..
  • తమ్ముడికి వాయిస్ మెసేజ్ పంపిన చందన..
  • సీసీ ఫుటేజ్ లో ఉన్నది చందన కాదు..?
  • వీడియోలో ఉన్నది మా వాళ్ళే.
  • పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పంచాయితీ.

మెట్‌పల్లి ముద్ర:- జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన బంకి దీప్తి కేసులో మిస్టరీ వీడడం లేదు. దీప్తి కేసులో గంటకో సంఘటన వెలుగు చూస్తుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తుండగా దీప్తి మృతి చెందిన తర్వాత ఇంట్లో నుండి వెళ్లిపోయిన దీప్తి చెల్లెలు చందన తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ చేసిన ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

చందన పంపిన వాయిస్ మెసేజ్ ఇలా ఉంది... సాయి నేను చందు అక్కను అసలు నిజం ఏంటంటే దీప్తి అక్క నేను ఇద్దరం తాగుదం అనుకున్నాం కానీ నేను తాగలేదు.అక్కనే తాగింది నేను మా ఫ్రెండ్ చేత ఇప్పించాను అది నేను ఒప్పుకుంటాను.కానీ నేను తాగలేదు అక్కనే తాగింది అక్క తన బాయ్ ఫ్రెండ్ ను పిలుస్తా అన్నది దానికి నేను ఒప్పుకోలేదు.అయిన సరే నేను పిలుస్తా అనడం తో ఒప్పుకున్న. నేను ఇంట్లో నుండి వెళ్లిపోవాలని అనుకున్నది నిజమే కానీ అక్కకు చెప్పి వెళ్ళిపోదం అనుకున్న కానీ అక్క అప్పటికే ఆఫ్ బాటిల్ తాగింది. ఫోన్ మాట్లాడి సోఫాలో వెళ్లి పడుకుంది. రెండు సార్లు లేపిన అయిన కూడా లేవలేదు. నేను వెళ్లిపోవాలని అప్పటికే నిర్ణయించుకున్నాను కాబట్టి ఇదే మంచి ఛాన్స్ అనుకోని ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి నేను నిజం చెబుతున్న నాకు అక్కను చంపాలని లేనే లేదు. ప్లీజ్ రా నమ్మురా. మేము రెండు బాటిళ్లు తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగాను, అక్క ఒడ్కా తాగింది. తర్వాత ఎమ్ జరిగిందో తెలియదు నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను అస్సలు నేను అక్కను ఎందుకు చంపుతాను. నేను చంపలేదు నువ్వు నమ్మురా అంటూ తమ్ముడికి చందన వాయిస్ మెసేజ్ పంపింది.అయితే దీప్తి మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నామని త్వరలో మిస్టరీని చేదిస్తామని కోరుట్ల సీ ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే దీప్తి చెల్లెలు మరో వ్యక్తి తో కోరుట్ల బస్టాండ్ లో నిజామాబాద్ బస్ ఎక్కి వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించగా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియా తో పాటు పలు ఛానళ్లలో ప్రసారం కాగా ఆ ఫుటేజ్ లో ఉన్నది చందన కాదని తమ కొడుకు, కోడలు ఫుటేజ్ లు అని ఆ సీసీ ఫుటేజ్ లను రిలీజ్ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని సీసీ ఫుటేజ్ ల ప్రసారం తొలగించాలని ఫుటేజ్ లలో ఉన్న వ్యక్తుల కుటుంబా సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.