యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...

యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...
  • మంత్రి తుమ్మలతో కలిసి వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల.....

యాదగిరిగుట్ట, ముద్ర :వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ చరిత్రలో రెండవ సారిగా ఉత్తర దర్శనం భక్తులకు మహాద్భుతంగా జరిగింది. అర్చక బృందం వేదమంత్ర పఠనాలతో సాంబ్రాణి పోగలతో మండపం చుట్టూ విద్యుత్ అలంకరణతో, మెరుపులు మెరిసిపోయాయి, స్వామివారు గుడి చుట్టూ పూల అలంకరణతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, భక్తులకు భక్తిశ్రద్ధలతో, దర్శన సమయంలో జై నరసింహ జై జై నరసింహ అంటూ భక్తులు హర్షద్వానాలతో స్వామివారిని దర్శించుకున్నారు.మంత్రి తుమ్మలతో కలిసి వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల.

వైకుంఠ పర్వదినం సందర్భంగా శనివారం దర్శన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్ టైల్స్, హ్యాండ్లూమ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రభుత్వం విప్, ఆలేరు శాసనసభ సభ్యులు బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్తర ద్వారం నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వారికి స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం జరిపి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.