తొలి బదిలీ..!

తొలి బదిలీ..!
  • ఇద్దరు కీలక అధికారుల మార్పు
  • సీఎం ప్రత్యేక కార్యదర్శిగా శేషాద్రి
  • ఇంటెలిజెన్స్​ చీఫ్​గా శివధర్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఊహించినట్టే జరిగింది. సీఎంగా రేవంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన గంట వ్యవధిలోపే ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఇద్దరు అధికారులను ప్రభుత్వం మార్చింది. సీఎం ప్రత్యేక కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ వి. శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ,1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. ఈ క్రమంలో పీఎం కార్యాలయంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాగా రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉన్న శేషాద్రికి సీఎంప్రత్యేక కార్యదర్శిగా బాద్యతలు అప్పగించడం విశేషం. ఇప్పటికే ధరణిని రద్దు చేసి దాని స్ధానంలో కొత్త పోర్టల్​ను తీసుకువస్తానని రేవంత్​ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శేషాద్రి నియామకంతో రేవంత్.. ధరణి మార్పుపై తొలి ఫోకస్​ పెట్టినట్లు స్పష్టమవుతోంది. కాగా త్యంత విలువైన భూములున్న రంగారెడ్డి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పని చేయడంతో ఆయా జిల్లాలో భూములపై సమగ్ర అవగాహన ఉంది. బెంగళూరులోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి పట్టభద్రుడైన శేషాద్రికి సమర్థుడైన అధికారిగా,మితభాషిగా పేరుంది. ఇటు 

ఇంటెలిజెన్స్​ చీఫ్​గా శివధర్​రెడ్డి..!

మాజీ సీఎం కేసీఆర్​ పక్కనపెట్టిన 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి బి.శివధర్​రెడ్డిని రేవంత్​ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్ గా అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్​ రెడ్డిని కేసీఆర్​ తొలిగించారు. ఇప్పుడు రేవంత్​ సీఎం అయ్యాక ఆయనకు అదే పదవి వరించింది. విశాఖపట్నంలో పోలీసు కమిషనర్ గా , ఉమ్మడి ఏపీలో అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్‌గా పని చేసిన శివధర్​రెడ్డి ప్రస్తుతం రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీకి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా కొనసాగుతున్నారు.