సిఎం రేవంత్ ను అభినందించిన ప్రధాని మోడీ

సిఎం రేవంత్ ను అభినందించిన ప్రధాని మోడీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కార్ కు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.