సబ్ కలెక్టర్ ను నియమించండి - కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

సబ్ కలెక్టర్ ను నియమించండి - కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

మెట్‌పల్లి ముద్ర: మెట్‌పల్లి డివిజన్ కు సబ్ కలెక్టర్ ను ప్రభుత్వం వెంటనే నియమించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా కోరారు. శనివారం టీపీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ గా ఉన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ ను నియామకం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఎన్నో రోజులుగా పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ లేకపోవడంతో పాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎన్నో దరఖాస్తులు పెండింగ్ లో ఉండి ప్రజలు తమకు కావలసిన పనులు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. గతంలో ఇంచార్జిగా ఆర్డీవో ఉన్నప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అండలేవన్నారు.సుమారుగా గత 3 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాథుడు లేకుండా సబ్ కలెక్టర్ కార్యాలయం తయారయ్యిందని, అక్కడకు వెళ్లిన ప్రజలకు కనీసం సమాధానం చెప్పేందుకు ఎవరూ లేని పరిస్థితి ఎదురవుతుందన్నారు.

ఈ కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి అధికారి లేకపోవడంతో డివిజన్ లో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని, సబ్ కలెక్టర్ కార్యాలయం ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. జిల్లాలో కీలకమైన ఈ రెవెన్యూ డివిజన్ లో సబ్ కలెక్టర్ లేకపోవడంతో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వడానికి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లాల్సి వస్తుందని దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారన్నారు. చివరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ కు పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ ను వెంటనే నియమించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ యూత్ నాయకులు గద్దల భరత్. రాజ్,కోరే రాజుకుమార్ ,శిలోక్, తేజ, జగదీష్, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు