ఓటర్ల జాబితా తయారీలో సహకరించండి - నిర్మల్ ఆర్డీవో స్రవంతి

ఓటర్ల జాబితా తయారీలో సహకరించండి - నిర్మల్ ఆర్డీవో స్రవంతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్-రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అధికారులకు సహకరించాలని నిర్మల్ ఆర్డీవో స్రవంతి కోరారు. మంగళ వారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో స్రవంతి మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని తహసీల్దార్లను కోరారు.అలాగే అధికారులు సరైన ఓటర్ల జాబితా రూపొందించటం లో వారికి తోడ్పాటు నందించాలని రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలతో పాటు నిర్మల్ నియోజక వర్గంలోని తహశీల్దార్లు కూడా పాల్గొన్నారు.