108 అంబులెన్స్ లో ప్రసవం

108 అంబులెన్స్ లో ప్రసవం

కేసముద్రం, ముద్ర: పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కాన్పు చేయడంతో తల్లి బిడ్డ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. అర్పణ పల్లి గ్రామానికి చెందిన ఎం.సువార్త పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వీరన్న, సైదులు గర్భిణీని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా అర్పణ పల్లి దాటిన తర్వాత సువార్తకు నొప్పులు తీవ్రంగా రావడంతో అంబులెన్స్ లోనే సాధారణ కాన్పు చేసారు. సువార్త పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డను రక్షించిన 108 సిబ్బంది సైదులు, వీరన్నను సువార్త బంధువులు అభినందించారు