సీఎం పర్యటన.. నాయకుల నిర్బంధం

సీఎం పర్యటన.. నాయకుల నిర్బంధం

ఖమ్మం, ముద్ర: ముఖ్యమంత్రి కేసీఆర్ బోనకల్లు మండల పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురు పార్టీ నాయకులను పోలీసులు గురువారం తెల్లవా రుజామున నిర్బంధించారు. బిజెపి , కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రజాసంఘాల నాయకులు సీఎం పర్యటనను అడ్డుకుంటారనే నెపంతో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖమ్మం , మధిర నియోజకవర్గంలో ఎక్కువ మంది నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బోనకల్ మండలంలో అరగంట పాటు పర్యటించనున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన మొక్క జొన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా బోనకల్ రానున్నారు. ఆ తర్వాత మహబూబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు హెలికాప్టర్ లో వెళ్ళనున్నారు