ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన కామ్రేడ్ కోలా శంకరన్న ఆదర్శప్రాయుడు.

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన కామ్రేడ్ కోలా శంకరన్న ఆదర్శప్రాయుడు.
  • సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి:బేజాడి కుమార్.

ఆలేరు జూలై 02 (ముద్ర న్యూస్):- బలమైన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడంలో  కామ్రేడ్ కోలా శంకరన్న ఆదర్శవంతమైన పాత్రను పోషించాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ కొనియాడారు.ఆదివారం  కామ్రేడ్ కోలా శంకరన్న 33 వ,వర్ధంతి సభ ను కొలనుపాక లో జరిగింది.సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చిరబోయిన రాజయ్య జండాను ఎగురవేశాడు.కామ్రేడ్ కోలా శంకరన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, కామ్రేడ్ కోలా శంకరన్న విద్యార్థులను తమ సమస్యల పరిష్కారం కొరకు సాగిన ఉద్యమం వరకే పరిమితం చేయకుండా,విద్య.. సామాజిక అంతరాలను అధిగమించే విధంగా ఉండాలని,ఉపాధి,ఉద్యోగ అవకాశాలను కల్పించేది గానే కాకుండా,విద్య సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేది గా ఉండాలని ఉపదేశించాడని, విద్యార్థులు ప్రజలలో భాగమై,భారమైన ప్రజల బతుకులను మార్చే విధంగా ఉండాలని, విద్యార్థులకు విడమర్చి చెప్పిన కామ్రేడ్ కోలా శంకరన్న అది శాస్త్రీయ విద్యతోనే సాధ్యమని శాస్త్రీయ విద్య ను సాధించడానికి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, చైతన్య పరిచాడని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అన్నారు.కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ఆర్ ఎస్ ఎస్ బీ జే పీ, బీ ఆర్ ఎస్ ప్రభుత్వాలు ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని అన్నారు.మోడీ ప్రభుత్వం నిత్యం హిందూ మతం పేరుతో ప్రజలను విభజిస్తుంది,విచ్ఛిన్నం చేస్తుందని, ఈ పేరుతో బడా కార్పోరేట్ సంస్థలకు,పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తుందని,దేశాన్ని తిరోగమనం లోకి నెట్టివేసిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తమ్మడి అంజయ్య, చిరబోయిన కొమురయ్య, వంగాల నర్సింహారెడ్డి, దడిగే కృష్ణ,ఆర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.