బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం
  • సూర్యాపేట 18 వ వార్డ్ లో గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి ప్రచారం
  • భీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ గడపగడపకు ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి
  • మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతు తెలుపుతూ సునీత ప్రచారానికి బ్రహ్మారథం పట్టిన స్థానికులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతాయని సూర్యాపేట టిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో 17వ వార్డులో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. సందర్భంగా పలు  కాలనీల వాసులు సునిత జగదీష్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు సూర్యాపేట ఎలా ఉందో, ఇప్పుడు జగదీష్  రెడ్డి  ఎలా అభివృద్ధి చేశారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. నాడు అభివృద్ధి  కి నోచుకోకుండా కరువు కాటకాలతో తల్లడిల్లిన సూర్యాపేట లో ఇప్పుడు పుష్కలంగా సాగునీరు, ఉచిత కరెంట్‌, రైతుబంధు పథకాలతో ధాన్యాగారంగా విరజిల్లుతున్నదన్నారు.  కాళేశ్వరం, మూసీ, నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. గృహలక్ష్మి, దళితబంధు పథకాలను ప్రతిఒక్కరికీ అందిస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి   హ్యాట్రిక్‌ సాధించి మళ్లీ  అభివృద్ధి  నీ పరుగులు పెట్టిస్తారనీ పేర్కోన్నారు. మెట్రో నరాలకు దిటుగా సూర్యాపేట అభివృద్ధి చేస్తున్న ఘనత జగదీశ్ రెడ్డి దే అన్నారు. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి నెలకొల్పిన ప్రశాంత వాతావరణం తోనే సూర్యాపేటకు ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థలు క్యూ కడుతున్నాయి అన్నారు. 2014, 18లో జగదీష్ రెడ్డి కి వేసిన ఓటు సూర్యాపేటకు మెడికల్ కాలేజ్, ట్యాంక్ బండ్, స్పోర్ట్స్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, భానుపురి భారతి, వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇవ్వడమే కాకుండా అన్నిటికీ మించి సూర్యాపేటలో జిల్లా కేంద్రంగా మార్చింది అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మంత్రి జగదీష్ రెడ్డికి పార్టీలకతీతంగా ప్రజలు అండగా ఉండాలని కోరారు.