అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం..

అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం..

ఇంటింటా కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం

 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి : ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వాడలోని 34వ వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి, ఇంటింటికి తిరుగుతూ.. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లులేని నిరుపేదలకు అర్హతకు అనుగుణంగా ఇల్లు లేని వారిని గుర్తించి, గృహా నిర్మాణం మంజూరు చేయాల్సి ఉండగా, బలహీన వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలను ఇల్లు లేదని గుర్తించి కూడా ప్రభుత్వ పరంగా మంజూరు చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ కార్మికులు, టేకేదార్లకు ఏవిధమైన ఆంక్షలు లేకుండ పీఎఫ్ ఉన్న వారందరికి నెలకు రూ. 4000 పెన్షన్ సౌకర్యం కల్పిస్తామాన్నారు.
వయసుతో నిమిత్తం లేకుండ వివాహమైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తాం. మార్కెట్లో సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ ప్రజలపై భారం పడకుండ రాయితీ కల్పించి, సిలిండర్ రూ.500లకే అందిస్తామని, 
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. వరి ధాన్యం మద్ధతు ధరపై అదనంగా ప్రతి క్వింటాలు రూ.500 ప్రోత్సాహం అందిస్తాం. ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు కేటాయిస్తామని భరోసానిచ్చారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం కల్పిస్తామని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేస్తామని, మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని జీవన్ రెడ్డి కోరారు.