లంచం ఇవ్వకపోతే సీజ్ చేస్తాం..

లంచం ఇవ్వకపోతే సీజ్ చేస్తాం..
: :
  • బెల్ట్ షాప్ వాళ్లు వైన్స్ ల నుండి మందు తెచ్చుకోండి...
  • బార్ ల వాళ్లు ఇవ్వద్దు.
  • ఎక్సైజ్ సీఐ వాయిస్ వైరల్
  • వాయిస్ వైరల్ తో బెదిరింపులు


మెట్‌పల్లి ముద్ర:- బెల్ట్ షాప్ నిర్వాహకులు వైన్స్ ల నుండి మద్యం తెచ్చుకోవాలని. బార్ ల నిర్వాహకులు బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం అమ్మవద్దని ఎక్సైజ్ సీ ఐ రాధ అన్నారు. ఈ  మేరకు సీ ఐ ఓ బార్ నిర్వాహకునితో మాట్లాడిన మాటలు వాయిస్ రికార్డ్ రూపంలో వాట్సప్ గ్రూప్ లలో వైరల్ గా మారాయి ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలో బెల్ట్ షాప్ లను నిషేధించాలని. బెల్ట్ షాప్ లను బంద్ చేస్తే నజరానా ఇస్తాం అని ప్రకటిస్తే. మెట్‌పల్లి సర్కిల్ పరిధిలోని అధికారి మాత్రం బెల్ట్ షాప్ లను ప్రోత్సహించే విధంగా. వైన్స్ షాప్ ల నుండి మద్యం తెచ్చుకోవాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

సీ ఐ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి బార్ ల నుండి మద్యం తెచ్చుకుంటే సీజ్ చేస్తామని బెదిరించడం ఏంటని, బెల్ట్ షాప్ లను మూసివేస్తే ప్రజలు వైన్స్, బార్ లలో మద్యం కొంటారని దీనివలన అందరికీ ప్రయోజనం కలుగుతుందని.బెల్ట్ షాప్ లు బంద్ చేయాలని ఈ విశయం పై సంబంధిత మంత్రి నీ కలుస్తానని చెప్పడంతో. నేను 14 సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తున్నానని ఇలాంటి బెదిరింపులు నాకు మామూలేనని నీకు దిక్కున్న చోట చెప్పుకో, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరని ఎక్సైజ్ సీ ఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.. ఈ వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న అధికారి మళ్లీ వ్యాపారికి ఫోన్ చేసి.. రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకు వైరల్ చేస్తున్నావని దబాయించారు.

తిరిగి ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. చివరకు 'అసలు నువ్వు లైసెన్స్ హోల్డర్వే కాదు అని అధికారి అంటే.. డబ్బుల కోసం మీరు నాకేందుకు ఫోన్ చేశారు. అని వ్యాపారి ప్రశ్నించారు. నిన్ను డబ్బులు అడిగినట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చని అధికారి అనగా, ఉన్నాయని వ్యాపారి చెప్పారు. ఆ తర్వాత అధికారి పరోక్షంగా డబ్బులు అడిగినట్లు ఉన్న ఆడియోను కూడా వ్యాపారి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది.  ఈ వాయిస్ బెల్ట్ షాప్ లను నివారించాలని ప్రభుత్వం చెబుతున్న ఈ అధికారి బెల్ట్ షాప్ లను ప్రోత్సహించడం, పరోక్షంగా లంచం అడగడం వెనక అంతర్యం ఏమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.