దిగుబడి సమస్య ఉండొద్దు - తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్

దిగుబడి సమస్య ఉండొద్దు - తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య ఉండొద్దని తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను సందర్శించి లారీల కొరతను తీర్చేందుకు రవాణాశాఖ సహకారంతో ఇసుక రవాణా కు వెళ్లే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు అలాట్ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత రైస్మిల్లర్ లకు తహసీల్దార్ ఆదేశించారు.
ఆయన వెంట సీఐ నరేందర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  ఫైమ, ఆర్ ఐ చింతల రవీందర్, వీఆర్ఏ లు గొడుగు అనిల్, శివ, అభి, వెంకటరాజమ్ ఉన్నారు.