ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైన డీఎస్పీ రవీందర్ రెడ్డి..

ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైన డీఎస్పీ రవీందర్ రెడ్డి..

మెట్‌పల్లి ముద్ర :  పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు మెట్‌పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సేవలు అందించినందుకు అధికారులకు, సిబ్బందికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అవార్డులు ప్రకటించగా. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ రవీందర్ రెడ్డిని ఎంపిక చేసింది. బుధవారం సాయంత్రం  హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే అవార్డుల పంపిణీ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి అవార్డును అందుకోనున్నారు. డీఎస్పీ కి అవార్డు రావడం పై నియోజకవర్గ పోలీస్ లు హర్షం వ్యక్తం చేశారు.