ఎట్టకేలకు పోస్టింగ్​ ఐఏఎస్ అధికారుల బదిలీ

ఎట్టకేలకు పోస్టింగ్​ ఐఏఎస్ అధికారుల బదిలీ
  • వెయిటింగులో ఉన్నవారందరికీ నియామకాలు
  • ఒకేసారి 31 మందిని కదిలించిన ప్రభుత్వం
  • సీనియర్ ల చేతులలో ఉన్న శాఖలకు కొత్త అధికారులు
  • ఐఏఎస్​ల ఆక్రోషంపై ‘ముద్ర’ కథనం ఎఫెక్ట్​
  • స్పందించిన సర్కార్.. హడావుడిగా ఉత్తర్వులు

ముద్ర, తెలంగాణ బ్యూరో:
చాలా కాలంగా వెయిటింగులో ఉన్న ఐఏఎస్​అధికారులకు ఎట్టకేలకు పోస్టింగులు లభించాయి. వీరిలో కొందరు దాదాపు​రెండేండ్ల నుంచి నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పగి దాకా కొందరు అధికారుల దగ్గరే ఐదారు శాఖలు ఉన్నాయి. దీంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఐఏఎస్​అధికారుల పరిస్థితి మీద బుధవారం ‘ముద్ర’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం శుక్రవారం ఒకేసారి 31 మంది ఐఏఎస్​అధికారులను బదిలీ చేసింది. వెయిటింగులో ఉన్న వారందరినీ ఆయా శాఖలలో సర్దుబాటు చేసింది. సీనియర్​ఐఏఎస్​అధికారులల దగ్గర ఉన్న శాఖలను ఇతర అధికారులకు అప్పగించారు. 1990 బ్యాచ్‌కు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. ఇప్పటిదాకా సందీప్​ కుమార్ సుల్తానియా దగ్గర ఉన్న పలు శాఖలకు అధికారులను నియమించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖకు ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌, టూరిజం డైరెక్టర్​గా నిఖిల, సెర్ప్ సీఈఓగా గౌతంను నియమించారు. ఎక్కువ శాఖలు సందీప్ కుమార్​దగ్గరే ఉన్న విషయాన్ని ‘ముద్ర’ బయటపెట్టిన విషయం తెలిసిందే. నీతూ కుమారి ప్రసాద్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఐఏఎస్​ అధికారిరి నియమించారు. జ్యోతి బుద్దా ప్రకాష్ ఇన్చార్జిగా ఉన్న​హ్యాండ్​క్రాప్ట్​ఎండీ పోస్టుకు అలుగు వర్షిణిని బదిలీ చేశారు. ఆయుష్‌  డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌ను నియమించారు. శర్మన్​రిటైర్మెంట్ తర్వాత ఇన్చార్జులతో కొనసాగుతున్న హైదరాబాద్​జిల్లా కలెక్టర్​గా అనుదీప్​ను బదిలీ చేశారు. ఇప్పటి వరకు మేడ్చల్​కలెక్టర్ అమోయ్ కుమార్ ఇక్కడ​ఇన్చార్జి కలెక్టర్​గా ఉన్నారు. 


బదిలీ అయిన ఐఏఎస్​ అధికారులు

సంఖ్య అధికారి  పోస్టింగ్​
01.  శశాంక్​గోయల్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీ, డైరెక్టర్​జనరల్
02.  శైలజారామయ్యర్ వైఏటీఅండ్ సీ, ప్రధాన కార్యదర్శి (యువజన సర్వీసులు)
03. హరిచందన దాసరి ఆయుష్, డైరెక్టర్
04.  అలుగు వర్షిణి  హ్యాండ్లూం అండ్​టెక్స్ టైల్స్ డైరెక్టర్
05.  కొర్ర లక్ష్మి  క్రీడల శాఖ డైరెక్టర్
06. కె.హైమావతి  ఎయిడ్స్ సొసైటీ డైరెక్టర్
07. కె.హరిత  ఫైనాన్స్​శాఖ సంయుక్త కార్యదర్శి
08. కె. స్వర్ణలత  సాధారణ పరిపాలన శాఖ 
09. కె. నిఖిల  పర్యాటక శాఖ డైరెక్టర్
10.  ఎం. సత్యశారదాదేవి వ్యవసాయ, సహకారశాఖ డిప్యూటీ కార్యదర్శి
11. ప్రియాంక ఆల కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
12. ఐల తిరుపతి  కలెక్టర్, ములుగు
13. ఎస్. కృష్ణ ఆదిత్య కాలుష్య నియంత్ర మండలి కార్యదర్శి
14. ముజమ్మిల్ ఖాన్​ కలెక్టర్, పెద్దపల్లి
15. ఎస్. సంగీత సత్యనారాయణ టీఎస్​ఫుడ్స్, ఎండీ
16. ప్రతీక్​జైన్​  భద్రాచలం ఐటీడీఏ పీఓ
17. గౌతం పొట్రు  సెర్ప్, సీఈఓ
18. వెంకటేశ్​ధోత్రే స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, మహబూబ్​నగర్ 
19. అభిలాష అభినవ్​ స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, ఖమ్మం.
20. స్నేహశబరిష్​                           జీహెచ్ఎంసీ, అదనపు కమిషనర్ 
21. ఎం.మనుచౌదరి స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, కామారెడ్డి
22. దివాకర  స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, జగిత్యాల
23. అనుదీప్​దురిశెట్టి  హైదరాబాద్ కలెక్టర్
24. కుమార్​దీపక్​ స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, నాగర్ కర్నూల్
25.  చెక్క ప్రియాంక స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి
26. జల్ద అరుణశ్రీ  స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, కరీంనగర్
27. చంద్రశేఖర్​బడుగు స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, సంగారెడ్డి
28. నవీన్​నికొలస్​ సోషల్​వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్​గురుకులాల కార్యదర్శి 
29. ప్రతిమాసింగ్​  స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, రంగారెడ్డి
30. గరిమా అగర్వాల్​ స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్, సిద్దిపేట
31. మంద మకరందు నిజామాబాద్​మున్సిపల్ కార్పొరేషన్, కమిషనర్.