ఎంపీ ఉత్తం నిధులతో రేపాలలో  సిసి రోడ్డుకు శంకుస్థాపన

ఎంపీ ఉత్తం నిధులతో రేపాలలో  సిసి రోడ్డుకు శంకుస్థాపన

మునగాల, ముద్ర: నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి నిధులతో సోమవారం మునగాల మండల పరిధిలోని రేపాల 10వ వార్డు ఎస్.సి కాలనీలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వరికెల రమేష్ చేతుల మీదుగా సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ....పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, రోడ్లపై వర్షం నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ.. సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లి రమణ, ఉపసర్పంచ్ గండు జ్యోతి, వార్డు మెంబర్ మెరుగు హరిప్రియ, చిట్యాల మోహన్ రెడ్డి, రావులపెంట సతీష్ తదితరులు పాల్గొన్నారు.