పసిపిల్లల ను అర్ధాకలి తో అరిగోస పెట్టడమే పాలకుల విధానమా

పసిపిల్లల ను అర్ధాకలి తో అరిగోస పెట్టడమే పాలకుల విధానమా
  • మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కరించలేరా
  • విద్యాశాఖామంత్రికి ఏఐఎస్ఎఫ్ సూటి ప్రశ్న

ముద్ర నేరేడుచర్ల: గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద మధ్యతరగతి పిల్లలు అర్ధాలతో అలమటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకల రాజు శ్రీను నేరేడుచర్ల పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు రేఖ ఉపేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 సిపిఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాళీ ప్లేట్లతో పసి పిల్లలు రోడ్డు మీద రాస్తారోకో చేసిన అనంతరం వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి దాపురించిందని ప్రభుత్వమే వారికి గ్యాస్ మరియు కోడిగుడ్లు సరఫరా చేసి పెంచిన వారి వేతనాలు తక్షణమే చెల్లించాలని కనీస వేతనం చట్టంకింద వారికి వేతనాలు ఎప్పటికప్పుడు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మరి కొద్ది రోజుల్లో దసరా సెలవులు రాబోతున్నాయి అని ఈ లోగా సమస్య పరిష్కరించకుంటే మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని, వెయ్యి రూపాయల వేతనం తో పనిచేస్తున్నారని కేవలం రోజుకు 33 రూపాయలతో కుటుంబం గడిచేది ఎలా అని ఆ బిల్లును కూడా వారి పుస్తెలు తాకట్టు పెట్టి పచారీ షాపుల్లో సరుకులు తెచ్చి పిల్లలకు పెడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా  లేకపోవడం సిగ్గుచేటు అయిన విషయమని వారు ఎద్దేవా చేశారు. పసిపిల్లల సమస్య కొరకు విద్యాశాఖ మంత్రి కృషి చేయాలని లేదా రాజీనామా చేసి తప్పుకోవాలని వారు సూచించారు