తడిసి ముద్ద అయిన జగిత్యాల

తడిసి ముద్ద అయిన జగిత్యాల
  • వారం రోజులుగా కొనుగోలు కేద్రంలో వర్షపు నీటిలోనే వరిధాన్యం 
  • వరి మొలకలోచ్చి బోరున విలపిస్తున్న రైతులు

ముద్ర ప్రతినిధి జగిత్యాల: గత వారం రోజులగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు. జిల్లాలో సుమారు 70  వేల ఎకరాల్లో వరి, మామిడి, నువ్వు, మొక్కజొన్న పంటలు దెబ్బ తిన్నాయి. ఆరుగాలం శ్రమించి రెండు, మూడు రోజుల్లో వరి ధాన్యం మిల్లుకు చేరి శ్రమకు పలితం దక్కుతున్దనుకుంటే అకాల వర్షాలతో రైతుకు కన్నీల్లె మిగిలాయ. జిల్లాలో గత పది రోజుల క్రితమే వేల ఎకరాల్లో  వరిధాన్యం కోత కోసి అమ్మకానికి కొనుగోలు కేద్రాలకు తీసుకుని వచ్చారు. వారం రోజులుగా ప్రతి రోజు వర్షం కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాలు చెరువులను తలపిస్తున్నాయి. రోజు వర్షపు నీటిని రైతులు ఎప్పటికప్పుడు తోడేస్తున్నప్ప్పటికి వర్ష కాలంలో వర్షాలు కుర్సినట్లు రోజు వర్షం పడడంతో  నేలలో తడి ఆరక  వర్షపు నీరు ఇంకిపోవడం లేదు.

దాంతో జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం, వెలగటూర్, ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి, కథలాపూర్, ఇబ్రహీం పట్నం, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో వర్షపు నీటితో కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికి వరి ధాన్యం మొలకలు రావడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ఇంకా వరి కోతలు చేపట్టని పొలాలు నేలకొరిగి పొలం లోనే మొలకలు వస్తున్నాయి.  ప్రభుత్వం తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యాని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓక వేల కొనుగోలు చేయకుంటే తమ పరిస్థితి అదో గతేనని.. ఆదుకోవాలని దినంగా వేడుకుట్టున్నారు.