పేదల బ్యాంక్ ఖాతాల్లో మోడీ రూ. 15 లక్షలు వేయకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి 

పేదల బ్యాంక్ ఖాతాల్లో మోడీ రూ. 15 లక్షలు వేయకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి 
  • రైతుబంధు ఎకరానికి  రూ  7 వేలు  వేయించే బాధ్యత నాది
  • ఎమ్మెల్సి జీవన్ రెడ్డి 
    ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిజెపికి ఓటు ఎందుకు వేయాలి. .. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేశాడని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనుక తెప్పించి పేదల బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోడీ పేర్కొన్నారని, ఎవరి ఖాతాలో అయిన పడ్డాయని ప్రశ్నించారు. బిజెపి వాళ్లు ఓట్ల ఆడడానికి వస్తే అడగాలని పేర్కొన్నారు. మోడీ ముందు 15లక్షలు ఖాతాలలో వేశాకని ఓటు వేస్తామని చెప్పాలన్నారు. రూ.15 లక్షలు వేయకుంటే బీజేపీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్ కు ఓటు వేయాలని అన్నారు. బిఆర్ఎస్ ఎన్నికల ముందు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతది పెన్షన్లన్నీ పోతాయని  అబద్ధ ప్రచారం చేశారని... ఎక్కడైనా పెన్షన్ బంద్ అయిందా, కరెంటు పోతుందా అని ప్రశ్నించారు. రైతుబంధు ప్రస్తుతానికి ఎకరానికి 5000 పడుతున్నాయని  తర్వాత 7,000 వేయించే బాధ్యత నాది అని పేర్కొన్నారు. భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాకపోవచ్చు అని  నిజమైన రైతులకు ఎకరానికి 7000 వస్తుందని అన్నారు. ఎన్నికలముందు  చెప్పిన విధంగా రైతులకు  రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకులకు రైతులు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని అందుకు గ్యారంటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు