శరత్ సిటీ మాల్‌లో న్యూమీ అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం…

శరత్ సిటీ మాల్‌లో న్యూమీ అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం…

ముద్ర,హైదరాబాద్:-జెన్ జెడ్ మహిళల కోసం భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌లలో ఒకటైన న్యూమీ భారతదేశంలో తమ అతిపెద్ద రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో వున్న శరత్ సిటీ మాల్‌లో ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా న్యూమీ సీఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ జసోరియా మాట్లాడుతూ…. హైదరాబాద్ ఎల్లప్పుడూ దాని ఉత్సాహపూరితమైన సంస్కృతి, శక్తివంతమైన వినియోగదారుల జనాభాతో త‌మ హృదయాలకు దగ్గరగా ఉంటుందన్నారు. త‌మ ఆన్‌లైన్ షాపర్‌లలో అధిక శాతం ఈ నగరం నుండి ఆర్డర్ చేయడం తాము చూస్తున్నామన్నారు. వారి అవసరాలను తీర్చడానికి తాము భారతదేశంలోనే త‌మ అతిపెద్ద రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్ నడిబొడ్డున ప్రారంభించామన్నారు. అద్భుతంగా రూపొందించిన త‌మ స్టోర్ చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందన్నారు.

త‌మ‌ ఓమ్నీ ఛానెల్ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా రాబోయే 12-15 నెలల్లో తాము ఇండోర్, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్ కోల్‌కతా, గౌహతి, భారతదేశంలోని ఇతర టైర్ 1 అండ్ 2 నగరాలకు విస్తరించాలని ప్రణాళిక చేస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో తాము జెన్ జెడ్ కోసం భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్-టెక్ బ్రాండ్‌గా అవతరించాలని, త‌మ‌ ఉత్పత్తి ఆఫర్‌లను పెంచాలని కోరుకుంటున్నామన్నారు. ఇది భారతీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా త‌మ ముద్రను కూడా సృష్టిస్తుందన్నారు.