పాత బస్తీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు...

పాత బస్తీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు...

ముద్ర,హైదరాబాద్:-పాతబస్తీలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అరేబియన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు చేసి ఫ్రిజ్లో కుళ్లిన మాంసం గుర్తించారు. పాడైపోయిన ఫ్రిజ్లో వండిన వంటకాలు గుర్తించారు. అలాగే పాతబస్తీలోని షాబాద్ హోటల్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రైప్రూట్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే కాటేదాన్ లోని మూడు ఆయిల్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు.భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిపారు  వంట నూనె తయారీలో కంపెనీలు నిబంధనలు పాటించలేదని గుర్తించారు. నిల్వ ఉంచిన ముడి పదార్థాల్లో  కీటకాలను గుర్తించారు.