శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే రాజన్న భక్తులు ఆలయానికి భారీగా చేరుకున్నారు. వేడుకలలో భాగంగా కొద్ది నిమిషాలలో స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించనుంది.  రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వస్త్రాలు సమర్పించనున్నారు.