కాంగ్రెస్, బిజెపిలకు ఘాటైన జవాబు ఇచ్చిన రాష్ట్ర మంత్రులు తుంగతుర్తి ఎమ్మెల్యే

కాంగ్రెస్, బిజెపిలకు ఘాటైన జవాబు ఇచ్చిన రాష్ట్ర మంత్రులు తుంగతుర్తి ఎమ్మెల్యే
  • తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభ తో విపక్ష కాంగ్రెస్, బిజెపిలకు ఘాటైన జవాబు ఇచ్చిన రాష్ట్ర మంత్రులు తుంగతుర్తి ఎమ్మెల్యే
  • ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ ఉత్సాహంలో  బిఆర్ఎస్ శ్రేణులు
  • నియోజకవర్గ ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం లో శుక్రవారం మంత్రుల పర్యటన సందర్భంగా జరిగిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం తుంగతుర్తి లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో అటు శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తో పాటు క్యాడర్లో ఉత్సాహం పొంగింది .ఆశీర్వాద సభా వేదిక ద్వారా రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్లు విపక్షాలైన కాంగ్రెస్ ,బిజెపిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలకు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు సభికులకు ప్రజానీకానికి వివరించడంలో సక్సెస్ అయ్యారు. మంత్రులు ఎమ్మెల్యే ప్రసంగాలు ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి .అరవపల్లి మండలంలో మంత్రులకు మండల నాయకత్వం భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అరవపల్లి ,తుంగతుర్తి మండలాల్లో గతంలో సైతం టిఆర్ఎస్ కు పట్టు బాగా ఉంది .ఎన్నికల ప్రచార పర్వంగా మంత్రుల పర్యటన ఆద్యంతం కొనసాగింది. టిఆర్ఎస్ పార్టీ మూడోసారి అభ్యర్థిగా ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను కెసిఆర్ ప్రకటించిన అనంతరం మొట్టమొదటి ప్రజా ఆశీర్వాద సభ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ జనాలు రావడం ఎమ్మెల్యేకు సంతృప్తినిచ్చింది.

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి నియోజకవర్గాల్లో పూర్తికాని పనులకు శంకుస్థాపన ,పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అదే అదనగా ప్రజా బల ప్రదర్శన అలాగే విపక్షాల విమర్శలకు అటు మంత్రుల చేత ఇటు తాను సరైన సమాధానం ఇస్తూ ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఏనాడు విపక్షాల విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్యేలైన టిడిపి వారిని ప్రజా ఆశీర్వాద సభలో తన పదునైన వాగ్దాటితో తీవ్రంగా విమర్శించారు. విపక్షాల విమర్శలకు దీటైన జవాబు ఇచ్చిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ముందు ముందు ప్రచార పర్వంలో మరింత వేగం పెంచినట్లు సమాచారం. ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం బలగం బాగా పెరిగిందని ప్రజా ఆశీర్వాద సభ ద్వారా రుజువైంది.