సెస్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ లు వెంటనే పరిష్కరించాలి : కె. దేవయ్య 

సెస్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ లు వెంటనే పరిష్కరించాలి : కె. దేవయ్య 

ముద్ర సిరిసిల్ల టౌన్; తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. దేవయ్య ఆధ్వర్యంలో సెస్ ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో గల సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ని కలిసి సెస్ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కె దేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు సెస్ కార్మికుల, ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్స్ లో భాగముగా సెస్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పి.ఆర్.సి.-2022 వేతనం అమలు చేయాలని, కోర్టు 4407/2021 ఉత్తర్వులను అనుసరించి సెస్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న  బాబు, రమేష్, శ్రీనివాస్ లను రెగ్యులరైజ్డ్ చేయుటకు గాను ఇటీవల జరిగిన మహా సభ యందు తీర్మాణం ప్రవేశపెట్టినారు కావున త్వరితగతిన వీరి ముగ్గురికి సెస్ సంస్థలో ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.

సంస్థలో పనిచేస్తున్న ఓ& ఎమ్ సిబ్బందికి రాబోయే వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులలో పనిచేయుటకు రేయిన్ కోట్స్, అవసరమైన పనిముట్లు, ప్రమాదాలను ముందే పసిగట్టే ఎలక్ట్రికల్ ఇండికేషన్ టెస్టర్స్  ఇప్పించి అత్యవసర విదులు నిర్వహించడానికి సెస్ సంస్థ సహాకారం అందించాలని కోరారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన ఉద్యోగులకు టి.ఓ.ఓ. ఎమ్.ఎస్. 79 తేది: 29.04.2015 ద్వారా ఇంక్రిమెంట్ మంజూరి చేయాలని, ఎ. శ్రీనివాస్, హెల్పర్ నుండి ఎ.ఎల్.ఎమ్ గా, పి.నర్సయ్య, ఎ.ఎల్.ఎమ్. నుండి లైన్మెన్ గా ప్రమోషన్ అర్హత ఉన్నందున ప్రమోషన్ కల్పించాలని కోరారు.

టి.ఇ.డబ్ల్యు, వి.ఇ.డబ్ల్యు గా పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మిక చట్టం ప్రకారం వేతనం సవరణ చేయాలని, అసిస్టెంట్ హెల్పర్లను హెల్పర్ లుగా ప్రమోషన్ ఇవ్వాలని, గత 10, 15 సంవత్సరాలుగా వివిధ కేడర్లలో పనిచేసిన వారికి త్వరితగతిన ప్రమోషన్ కల్పించాలన్నారు. సెస్ పరిధిలో వివిద క్యాడర్లలలో పనిచేస్తున్నటువంటి కొంత మంది ఉద్యోగుల యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగాలేనందున, వారిని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో మ్యుచువల్, జనరల్ ట్రాన్సఫర్లకు ఉద్యోగులకు అవకాశం కల్పించాలని అన్నారు. అగ్రిమెంట్ అయిన ప్రకారముగా 2006 నుండి సెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, రిటైర్మెంట్ అయినవారికి ఇ.పి.ఎఫ్. సంస్థ నుండి లబ్ది చేకూరేవిధంగా సెస్ సంస్థ నుండి అవసరమైన డాక్యూమెంట్లు పంపించి ఉద్యోగస్థులకు న్యాయం చేయాలని కోరారు. వేల్పుల బలరాం సెస్ ఉద్యోగి మరణించినందున కారుణ్యనియామకం క్రింద వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎల్.ఎమ్.డి డ్రైవర్లకు రావాలసిన, కేటాయించవలసిన అలవెన్సులు, డ్రెస్, వాషింగ్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తాత్కాలిక ఉద్యోగులకు వారి యొక్క విద్యార్హతలను పరిగణలోకి తీసుకుని పర్మినెంట్ ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చియున్నందున కొన్ని సంవత్సరాల నుండి తాత్కాలికంగా నియామకం అయిన వివిధ (6) ఉద్యోగులు వొజ్జల కవిత, భర్త. అగ్గిరాములు, గొనె రాజేష్ తండ్రి. నర్సయ్య, జి. ప్రభుదాస్, తండ్రి. ఆనందం, కె. ప్రసాద్, తండ్రి. రాంరెడ్డి, వి. కళ్యాణ్ చక్రవర్తి, తండ్రి. నాగిరెడ్డి, తొంపుల గీత లను విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సెస్ ఉద్యోగుల డిమాండ్ లపై సెస్ చైర్మన్, పాలక వర్గం సానుకూలంగా స్పందించారు అని ప్రధాన కార్యదర్శి దేవయ్య తెలిపారు.