కారు దిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న కోదాడ జెడ్పిటిసి

కారు దిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న కోదాడ జెడ్పిటిసి

ముద్ర ప్రతినిధి , కోదాడ: కోదాడ లో ఆదివారం జరిగిన సీఎం సభ సక్సెస్ అయిందని ఆనందపడుతున్న కోదాడ బిఆర్ఎస్ పార్టీకి సోమవారం భారీ షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన కోదాడ జెడ్పిటిసి మందలపు కృష్ణకుమారి , శేషు లు కాంగ్రేస్ పార్టీలో చేరారు . వీరితో పాటు కూచిపూడి మాజీ ఎంపిటిసి శెట్టి. భాస్కర్ తో పాటు మరో వందమంది కార్యకర్తలు , ముఖ్య నాయకులు సోమవారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు . కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని , టిపిసిసి ఉపాధ్యక్షురాలు నలమాద పద్మావతి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి.  చందర్ రావు ల సమక్షంలో కాంగ్రేస్ పార్టీ కండువ కప్పుకున్నారు . దీనితో కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల జెడ్పిటిసిలు కారు పార్టీ దిగి చెయ్యందుకున్నారు . ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి , పట్టం అధ్యక్షుడు వంగవీటి. రామారావు , ఎర్నేని బాబు , ముత్తవరపు. పాండురంగారావు , తూమాటి. వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు .