అర్చకుల దగ్గర రోజు 3 వేలు..!

అర్చకుల దగ్గర రోజు 3 వేలు..!

ఖర్చు పెట్టి వచ్చానంటూ.. కొండగట్టులో ఓ అధికారి డిమాండ్..
ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో అవినీతి మితిమీరుతోంది.. ఓ బాధ్యత గల అధికారి అర్చకుల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..! దేవాదాయ శాఖ స్పందించి లోతుగా విచారణ చేపడితే విషయాలు బయటకి రావచ్చని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

 రోజు 3 వేలు డిమాండ్...
కొండగట్టులో పనిచేసే సదరు అధికారి ప్రతి రోజు తనకు 3 వేలు ఇవ్వాలని అర్చకులను డిమాండ్ చేసినట్లు తెలిసింది. తాను ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు పెట్టినట్టు, అందుకు మీరు రోజు 3 వేలు ఇవ్వాల్సిందిగా ఆర్డర్ వేయడంతో అర్చకులు ఏమి అనలేక పలువురితో ఈ విషయం పంచుకున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని ఆలయ మాజీ డైరెక్టర్ ఒకరు ఈవో వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏది ఏమైనా కొండగట్టులో భక్తుల నిలువు దోపిడి మాత్రం ఆగడం లేదని దీని వల్ల అర్ధమవుతోంది. అర్చకులు అధికారికి డబ్బులు ఇవ్వాలంటే.. భక్తుల దగ్గర పిండాల్సిందే కదా... ఇది ఇలా ఉండగా, సదరు అధికారిపై చర్యలకు పలువురు దేవాదాయ శాఖ కమిషనర్ ని కలవనున్నట్లు కూడా తెలిసింది.