బైక్​ను ఢీకొన్న బస్సు

బైక్​ను ఢీకొన్న బస్సు

మెట్‌పల్లి,  ముద్ర: బస్సు బైక్ ను ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన దేవుడు దిలీప్ (30) పట్టణంలోని వెంకట్రావుపేట పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.  గురువారం ఉదయం పని నిమిత్తం పెట్రోల్ బంక్ కు వస్తున్నాడు. ఆ సమయంలో  నిజామాబాద్ నుండి వరంగల్ వెళుతున్న టీ  ఆర్టీసీ బస్సు మెట్‌పల్లి బస్ స్టేషన్ లోకి వెళుతుండగా  అతివేగంతో బస్సు వెనుక భాగం  బైక్ ను  ఢీకొట్టింది. దీంతో  దిలీప్ కు కాలు విరగడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   ప్రథమ చికిత్స అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు  దర్యాఫ్తు చేస్తున్నారు.