భక్తులు లేక బోసిపోయిన కొండగట్టు ఆలయం

భక్తులు లేక బోసిపోయిన కొండగట్టు ఆలయం

ముద్ర, మల్యాల: అధికశ్రవణమాసంకు తోడు, భారీ వర్షాల కారణంగా ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులు లేక బోసిపోతోంది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులతొ కిటకిటలాడే అంజన్న దేవస్థానం ఈ రోజు కేవలం పదుల సంఖ్యలోనే భక్తులు దర్శించుకునే పరిస్థితి కన్పించింది. అయితే రానున్న శ్రవణమాసం వరకు భక్తుల సంఖ్య ఇలాగే ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, ఈసారి ఆషాడమాసంతొ పాటు వెంటనే అధికమాసం రావడం వల్ల భక్తుల సంఖ్య విపరీతంగా తగ్గిందని, దాంతో తమ వ్యాపారాలకు తీవ్ర నష్టమని గుత్తేదారులు వాపోయారు.