ఎమ్మెల్యే ఇంటి ఎదుట పంచాయతీ సిబ్బంది ధర్నా

ఎమ్మెల్యే ఇంటి ఎదుట పంచాయతీ సిబ్బంది ధర్నా

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. మంగళవారం సీఐటీయూ కార్యాలయం నుంచి  ఎమ్మెల్యే ఇంటి వరకు చేరుకుని ఆందోళన చేశారు.  ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో ఎమ్మెల్యే పీఏ కు డిమాండ్లతో కూడిన  వినతిపత్రాన్ని అందజేశారు.  ఈసందర్భంగా సీఐటీయూ నాయకుడు రంజిత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు  13 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు.  పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటుగా, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడంతో పాటుగా ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మిక సంఘం నేతలు, జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.