బీసీ బంధుకు రాబందులు

బీసీ బంధుకు రాబందులు
  • చెక్కుల పంపిణీ వచ్చిన చిక్కేమిటి
  • అధికారుల చేతివాటం దళారుల కపట నాటకం
  • పైరవీల జోరు లబ్ధిదారుల బేజారు
  • అర్హులైన వారికి పంపిణీకి ఆటంకాలు ఏమిటి
  • ప్రజా ప్రతినిధుల అధికారుల సమన్వయ లోపం లబ్ధిదారులకు శాపం
  • అందుతుందా అన్న ఎదురుచూపులు అందదేమో అన్న బెదురు చూపులు
  • అధికారుల ఏమరుపాటు లబ్ధిదారుల కలవర పాటు
  • అధికార పార్టీకి చెందితేనే లక్ష సాయమా
  • మిగతా పార్టీల వారిని ఎంపిక చేయడంలో వివక్షత

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: వెనుకబడిన తరగతులలోని బాగా పేదరికంలో ఉన్న చేతివృత్తులకు సంబంధించిన కులాల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం ( బీసీ బంధు) పంపిణీలో జాప్యం ఏర్పడి లబ్ధిదారులు కొండకు ఎదురుచూసినట్టు ఇంకెప్పుడు చెక్కులు అందుతాయని పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంపికైన లబ్ధిదారులు ఈనెల 15న లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించి ఆచరణలో చేతులు  ఎత్తేయడంతో కంగు తిన్నారు. అమ్యా మ్యాలు అందలేదని ఇంకా వేలాది దరఖాస్తులు పెండింగ్ లోనే ఉండగా సందట్లో సడే మీయగా బీసీ బంధు కు రాబందుల గ్రహణం పట్టింది. ఎలాగోలా ప్రజాప్రతినిధులు అధికారులు దళారుల ను బతిమిలాడుకొని అంతో ఇంతో ముట్టజెప్పి చెక్కు చేతుల పడుతుందని చివరి దశలో పంపిణీ వాయిదా పడటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది ఇన్నాళ్లుగా ఫైరవీల జోరు లబ్ధిదారుల బేజారు అన్న చందంగా అధికారులు చేతివాటం ప్రదర్శించారని దళారులు కపటనాటకంతో మోసగించారని మదన పడుతున్న లబ్ధిదారులకు చివరికి అనుకున్న తేదీ ప్రకారం చెక్కులు కూడా చేతులో పడకపోవడంతో చెక్కు అందుతుందా లేదన్న ఎదురు చూపులతో  అందదేమో అన్న బెదురు చూపులతో ఎవరికి చెప్పుకోలే క అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం కారణంగా లబ్ధిదారులకు శాపంగా మారిందని విమర్శలు వినవస్తున్నాయి. ఇంత ముందు దళిత బంధు లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి కోదాడ నియోజకవర్గం జరిగిన అవినీతి మాదిరి ఈ పథకంలో కూడా డబ్బులు  చేతులు మారడం లబ్ధిదారులను కొంత అయోమయం మరికొంత ఆవేదనకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. తాము అంతా రెడీ చేసామని ప్రజా ప్రతినిధులు సమయం ఇవ్వడం లేదని అధికారులు తప్పుకో చూస్తుండగా అధికారుల నుంచి సమాచారం సరిగ్గా లేకపోవడం వల్లే పంపిణీ రాలేకపోయామని ప్రజా ప్రతినిధులు పేర్కొనటం గమనార్హం. కాకుండా అధికార పార్టీకి చెందిన బీసీలను ఎంపిక చేయడం ఆయా గ్రామాల్లో మిగతా పార్టీల వారు అర్హత ఉన్నప్పటికీ వివక్షత ప్రదర్శించి ఎంపిక చేయడం లేదని ఈ విషయంలో గ్రామాల్లోని అధికార బీఆర్ఎస్ చిన్నాచితక నాయకులు జోక్యం చేసుకుంటున్నారని అధికారులను ప్రభావితం చేస్తున్నారని కేవలం అధికార పార్టీ వారికే లక్ష సాయం అందేలా చక్రం తిప్పుతున్నారని మరికొన్ని గ్రామాల్లో అధికార పార్టీ చోటామోటా నాయకులు అవతారం ఎత్తారని వారు చెప్పినట్లే అధికారులు వింటున్నారని ఇతర పార్టీలో చెందిన బీసీలు వాపోతున్నారు.

ఉమ్మడి నల్లగొండలో 79 వేల 143 దరఖాస్తులు 37,584 మంది అర్హులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి మొత్తం 79 వేల 143 దరఖాస్తులు రాగా 37,584 దరఖాస్తులను అర్హుల ఎంపిక చేసి జాబితాలు తయారు చేశారు. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ జిల్లాలో 40 810 దరఖాస్తులు వేగా ఆరు నియోజకవర్గాల్లో కలిపి 11267 మందిని అర్హులుగా 29,543 మందిని అనర్హులు గా తేల్చారు .ఎంపీడీవో కార్యాలయంలో 2348 దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 23,374 దరఖాస్తులు రాగా 1339 అర్హులుగా ఎంపిక చేసి 10 033  మందిని పెండింగ్లో ఉంచారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 14959 దరఖాస్తులు రాగా 12978 మందిని అర్హులుగా  1961 మందిని   అనర్హులు గా తేల్చారు.

నియోజకవర్గానికి 300 మందికి పంపిణీ 

వాస్తవానికి లబ్ధిదారులందరికీ ఒకేసారి కి చెక్కుల పంపిణీ చేయకుండా నియోజకవర్గానికి 300 మందికి చొప్పున చెక్కుల పంపిణీ ఈనెల 15న చేస్తున్నట్లు మొదటగా అధికారులు జాబితాలు సిద్ధం చేసి ప్రకటించారు మిగతా వారికి విడుతలవారీగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. సరే అనుకున్న ప్రకారం 15వ తేదీన చెక్కులు అందుతాయాని ఎదురుచూసిన వారి ఆశలు అడియాసల య్యాయి.

సందట్లో సడే మియా అన్నట్టుగా దళారుల జోరు

ఒక ఇంట్లో ఒకరికి బీసీ బందు సాయం పథకం అనే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఒక్కో ఇంటి నుంచి మూడు నాలుగు దరఖాస్తులు చేయగా మిగతా వారికి కూడా తామే ఇప్పిస్తామని దళారులు దరఖాస్తుదారుల ఇల్లు చుట్టూ తిరుగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల్లోని కొందరికి ఈ పథకం వర్తిస్తుండగా ఎంబీసీ పేరుతో మిగతా కులాలకు కూడా అందుతాయని అందులో మీ కులం కూడా ఉందని మీకు తప్పక పథ కం అందిస్తామని నమ్మ  బలుకుతూ మీ గురించి అధికారులకు పైరవీ  చేశామని ఇప్పటికే కొంతమంది వద్ద గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పదివేల నుంచి 30 వేల రూపాయలు పైరవి కారులు ఆరోపణలు గుంజారని ఆరోపణలు షికార్లు చేస్తున్నాయి. ఇదే అదనుగా విచారణకు వెళ్లిన అధికారులు కూడా లబ్ధిదారుల పేర్లు జాబితాలో ఉండేలా చూస్తామని ఇచ్చిన కాడికి దండుకున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు. లక్ష రూపాయలు ఉచితంగా వస్తున్నప్పుడు 10 నుంచి 20,000 ఇస్తే పోయేదేముందని అధికారులు దళారులు లబ్ధిదారుల చుట్టూ తిరిగి అందిన కాడికి గుంజినట్టు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేస్తున్నారని మిగతా పార్టీల వారిని కావాలనే అర్హత ఉన్నప్పటికీ విస్మరిస్తున్నారని ఈ విషయంలో ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ చిన్నాచితకా నాయకులు జోక్యం చేసుకుంటున్నారని అధికార పార్టీ కాకుండా మిగతా పార్టీ లకు చెందిన బీసీలు ఆరోపిస్తున్నారు

మిగతా కులాలవారు లబ్ధిదారులు ఇంకెంతకాలం వేచి చూడాలో

ఉమ్మడినల్లగొండ జిల్లాలోని మొత్తం ఎంపికైన లబ్ధిదారులు 29,543 మందికి విడతలవారీగా నియోజకవర్గంలో 300 చొప్పున తమ పేరు ఎప్పుడు వస్తుందో అన్న ఆశతో వేచి చూస్తున్నారు. అంతేకాకుండా బీసీలలోనీ ప్రస్తుతం ప్రకటించిన నాయి బ్రాహ్మణ రజక ఉప్పర కుమ్మరి  ఔసుల కంసాలి కమ్మరి కంచరి వడ్ల వడ్డెర కృష్ణ బలిజ పూసల మేదర ఆరెకటిక మేర కులాలే కాకుండా అత్యంత వెనుకబడిన తరగతులు ఎం బి సి కులాలవారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ వంతు ఎప్పుడు వస్తుంద ఆని ఎంబీసీలు ఎదురుచూస్తున్నారు అలాగే ఈ పథకాన్ని తమకు కూడా వర్తింపజేయాలని బీసీ లోని మొత్తం 112 కులాలకు అందజేయాలని రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. ఈ పథకం ఇంతటితో ఆగిపోదని ఇది ఒక నిరంతర ప్రక్రియని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బీసీల్లోని కులాల వారు తమకు వస్తుందో రాదో అన్న ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

దరఖాస్తులు పెండింగ్లో ఉండగా పంపిణీ తేది ఎలా ప్రకటించారు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు లబ్ధిదారుల విచారణ వివరాల సేకరణ పూర్తికానప్పటికీ హడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతున్నట్లు అధికారులు పంపిణీ తేదీ ప్రకటించి 15వ తారీఖున పంపిణీ చేయలేక అబాసు పాలు అయ్యారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జూన్ ఆరో తారీకు నుంచి 20వ తారీకు వరకు ఆన్లైన్ సెంటర్ల వెంట పరుగులెత్తి పడిగాపులు కాచి అర్ధరాత్రి అనకుండా కష్టపడి దరఖాస్తు చేస్తే దరఖాస్తులను ఇంకా పెండింగ్లో పెట్టడం ఏమిటని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంపీడీవో కార్యాలయంలోని లాగిన్ లో పెండింగ్లో ఉండటం ఆయా జిల్లాల బీసీ కార్పొరేషన్ అధికారులకు మొత్తం జాబితాలు చేరకపోవడం అర్హులను ఎంపిక చేయకుండా పెండింగ్లో ఎందుకు పెట్టారనే అభ్యంతరాలు దరఖాస్తుదారులు లేవనెత్తుతున్నారు ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ఆలస్యం అవుతుందని అధికారులు కుంటి సాకులు చెప్పడం అధికారుల నుంచి పూర్తి సమాచారం తమకు అందలేదని ప్రజాప్రతినిధులు పేర్కొనడం మొత్తానికి అధికారులు ప్రజాప్రతినిధుల మధ్యన లబ్ధిదారులు నలిగిపోవడం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మొత్తానికి అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయ లోపం లబ్ధిదారుల  పాలిటశాపంగా  మారడం దళారుల చేతిలో చిక్కి విలవిల లాడటం మరికొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ చోటా మోట నాయకులు
పై రవి కారులుగా అవతారం ఎత్తడం ఇవన్నీ లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసిన వారి పాలిట  అశని పాతంలా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా దళారులకు చెక్ పెట్టి లబ్ధిదారుల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి వెంటనే చెక్కులను పంపిణీ చేయాల్సిందిగా లబ్ధిదారులు కోరుతున్నారు.