ఆర్థికం పేలవమే! ఆర్​బీఐ ఎకానమీ రిపోర్టులో వెల్లడి | Mudra News

ఆర్థికం పేలవమే! ఆర్​బీఐ ఎకానమీ రిపోర్టులో వెల్లడి | Mudra News

న్యూఢిల్లీ:  కొవిడ్​కు ముందు తరువాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ తీరు పేలవంగా ఉందని ఆర్​బీఐ ఎకానమీ సర్వే స్పష్టం చేసింది. ఎకానమీ సర్వే రిపోర్టును ఈ నేపథ్యంలో ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది. దీని  ప్రకారం సెప్టెంబరు 2012తో పోలిస్తే 2023 జనవరిలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. సెప్టెంబరు 2012తో పోలిస్తే జనవరి 2023లో ఉపాధి రంగంలో కూడా డౌన్​ఫాల్​ అయ్యింది. సెప్టెంబర్ 2012తో పోలిస్తే జనవరి 2023లో ఆదాయ స్థాయిలు తగ్గాయాని ఆ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్డర్‌లు 2008–-09 క్యూ1తో పోలిస్తే సెప్టెంబర్ 2022–-23 క్యూ3లో తగ్గాయి. 2022–-23 క్యూ3తో పోల్చినప్పుడు 2014–-15 క్యూ 1 పోస్ట్ రికవరీ మార్గంలో సేవా రంగం మలుపు తిరిగింది. కానీ, 2014–-15తో పోలిస్తే తయారీ ఇంకా కోలుకోలేదని వెల్లడైంది. ఇక దేశంలో కీలకమైన వ్యవసాయ, తయారీ రంగానికి బ్యాంకు రుణాలు తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2017 క్యూ1 - 2022–-23 18 నుండి క్యూ3 వరకు మౌలిక సదుపాయాలు, సేవా రంగంలో పెరుగుదల గమనించినట్లు వెల్లడైంది. నోట్ల రద్దు, జీఎస్టీల అమలు తరువాత ఆర్థికరంగం ఇంకా కోలుకోలేదని దీని ద్వారా నిర్ధారణ అవుతోంది.