సర్పంచ్ ఆర్థిక సహాయం

సర్పంచ్ ఆర్థిక సహాయం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మండలం చాగల్ గ్రామానికి చెందిన రంగు కుమార్ (జానీ) సోమవారం అనారోగ్యం చెందాడు. స్థానిక సర్పంచ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి రూ. 2 వేల ఆర్థిక సాయం అందించారు. వీరితో పాటు మాజీ వార్డ్ సభ్యుడు పొన్న రాజేష్ కాంగ్రెస్ గ్రామ శాఖ  అధ్యక్షులు చేపూరి ప్రభాకర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్,  సోన్నాయీల సురేష్, పొన్న సాయిలు, లొంక విజేందర్ తదితరులు పాల్గొన్నారు.