నవంబర్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి - ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్

నవంబర్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి - ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్

విశ్వరూప మహాసభను జయప్రదం చేయండి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: నవంబర్లో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్ ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిసూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి పుట్టల మల్లేష్ అధ్యక్షతన కరపత్రాల ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఎం ఈ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చింత జాన్ విల్సన్, సూర్యాపేట జిల్లాఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చింతా వినయ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై  పెన్ పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామంలో మాదిగ కాలనీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి  ఎం ఈ ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ కరపత్రాలను ఆవిష్కరించినారు. అనంతరం వారు మాట్లాడుతూ మహా జననేత మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఒక్క ఎస్సి ఏబిసిడి వర్గీకరణ కాకుండా సమాజంలో ఉండబడే సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలని ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన చరిత్ర ఒక్క మందకృష్ణ మాదిగ కు దక్కింది కానీ రాజకీయ పక్షాలు మాదిగ, మాదిగ ఉపకులాలకు  తీవ్ర అన్యాయం  చేశారన్నా రు .కేవలం మాదిగ, మాదిగ ఉపకులాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని మా వర్గాలను  అణిచివేతకు గురి చేశారనీ,నవంబర్లో జరగబోయే శీతాకాల సమావేశాల్లో ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి మాదిగ మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు .ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని యుద్ధం మొదలు పెడతామని హెచ్చరిస్తున్నాం అని, మహాజనుల ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ  ఆదిలాబాద్ టు హైదరాబాద్ విశ్వరూప రథయాత్రను చేపట్టారనీ ,ఆ యాత్రలో భాగంగా ఈనెల 26వ తారీఖున సూర్యాపేట జిల్లా  పిల్లలమర్రి పదో వార్డుకు చేరుకుంటుందన్నారు సాయంత్రం 5 గంటలకు మాదిగల విశ్వరూప రథయాత్ర చేరుకుంటుందనీ  సూర్య పేట జిల్లా విశ్వరూప మహాసభ సన్నాహక సదస్సును సూర్యాపేట జిల్లా మాదిగ, మాదిగ ఉపకులాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు .అదేవిధంగా హైదరాబాదులో నవంబర్ 7న జరిగే విశ్వరూప మహాసభను మాదిగ, మాది ఉపకులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల ఇంచార్జి  కొండేటి గోపీ, సూర్యాపేట పట్టణ ఎం ఎస్ పి యువజన నాయకులు తరాల కిరీటి యాదవ్, మండల సీనియర్ నాయకులు ఒగ్గు ప్రవీణ్, గుగ్గిళ్ళ శాంసన్, గుగ్గిళ్ళ సైదయ్య, గుగ్గిళ్ళ యాకుబు, జిల్లా పెళ్లి కిరణ్, మాతంగి కళ్యాణ్, రాజ్, గుగ్గిళ్ళ యశ్వంత్, గుగ్గిళ్ళ శ్రీధర్, గుగ్గిళ్ళ నాగరాజు, కత్తి సోమయ్య, గుగ్గిళ్ళ ఝాన్సీ, గుగ్గిళ్ళ వెంకటమ్మ, జానకమ్మ, గంగమ్మ, గుగ్గిల పిచ్చయ్య, మాతంగి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.