షర్మిల మౌనదీక్ష భగ్నం.. అరెస్ట్‌

షర్మిల మౌనదీక్ష భగ్నం.. అరెస్ట్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు.  ట్యాంక్‌బండ్‌పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి షర్మిలను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.