తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
  • ఇంటర్ తొలి ఏడాదిలో 63.85 శాతం ఉత్తీర్ణత
  • ఇంటర్ రెండో ఏడాదిలో 63.26 శాతం ఉత్తీర్ణత

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో జ‌రిగింది.  రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

http://tsbie.cgg.gov.in

http://results.cgg.gov.in